పోగొట్టుకున్న బంగారం.. ఒక్క రోజులో రికవరీ

5చూసినవారు
పోగొట్టుకున్న బంగారం.. ఒక్క రోజులో రికవరీ
శుక్రవారం మిర్యాలగూడలో డీఎస్పీ రాజశేఖర్రాజు వెల్లడించిన వివరాల ప్రకారం, నాగార్జున సాగర్ ఎస్బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాల సంచిని పోగొట్టుకున్న కొమ్ము రాహేలుమారికి పోలీసులు ఒక్క రోజులోనే 9 తులాల బంగారాన్ని వెతికి పట్టుకున్నారు. బ్యాంకులో ఆభరణాలు భద్రపరిచేందుకు వెళ్లిన రాహేలుమారి, నీళ్లు తాగేందుకు వెళ్లి వచ్చేసరికి సంచి కనిపించలేదు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, సంచిని తీసుకెళ్లిన మరో మహిళను గుర్తించి, ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం ఉద్దేశంతోనే సంచిని తీసుకెళ్లారా లేక మరేదైనా కారణమా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్