అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

706చూసినవారు
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
నాగార్జుసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్, శ్రీ కనకదుర్గ పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సోమవారం నిడమనూరు మండలం, తుమ్మడం గ్రామంలో శ్రీ కనకదుర్గా పరమేశ్వరి, నాభిశిల (బొడ్రాయి) కీర్తి ధ్వజ విమాన కలశ స్థాపనలు, కోట మైసమ్మ, సత్తెమ్మ, వెంకటలక్ష్మమ్మ, పోతురాజు విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొల్లం సైదులు, యడవెల్లి వల్లపురెడ్డి, పైసా సుధాకర్ రెడ్డి, రావుల లింగయ్య, గంగుల ఆంజనేయులు, బుర్రి వెంకన్న గౌడ్, కంబంపాటి శ్రీను, రాంబాబు, కొండేటి శ్రీను, గంగుల శివ, గంగుల లింగస్వామి తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్