తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టు

0చూసినవారు
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
తెలంగాణ ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం మరియు ఇచ్చిన హామీల అమలును కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కమిటీ సీఎం రేవంత్‌రెడ్డి నివాస ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన మలిదశ ఉద్యమకారులు ఉన్నం విజయభాస్కర్ మరియు అన్నేబోయిన కొండల్‌ను నిడమనూరు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్