రూప్లాతండాలో రోడ్ల సమస్యకు సర్పంచ్ చొరవతో పరిష్కారం

0చూసినవారు
ఉమ్మడి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం రూప్లాతండా గ్రామ పంచాయతీలో రోడ్ల దుస్థితిపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన నూతన సర్పంచ్ ధనావత్ రఘు నాయక్ వెంటనే స్పందించి, JCB సహాయంతో రోడ్లను చదును చేయించి, మట్టితో సమాంతరంగా తీర్చిదిద్దారు. ఈ చర్యతో గ్రామస్థులు, బాటసారులు, వాహనదారులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని రఘు నాయక్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్