నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం కొప్పోల్ శివాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తుల తాకిడి మొదలైంది. ఆలయ అర్చకులు అన్నెపర్తి శివాజీ శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకాలు జరిగాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగిస్తూ స్వామిని దర్శించుకున్నారు.