వర్షాలు కురవాలని పాలెం గ్రామంలో ప్రత్యేక పూజలు

2572చూసినవారు
వర్షాలు కురవాలని పాలెం గ్రామంలో ప్రత్యేక పూజలు
నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామంలో వర్షాలు కురవకపోవడంతో గ్రామ ప్రజలు స్థానిక బొడ్రాయి, గంగమతల్లికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జిల్లా హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్