
అసిస్టెంట్ డైరెక్టర్ ను కలిసిన చేనేత సహకార సంఘం కార్యవర్గం
నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల చేనేత సహకార సంఘం అధ్యక్షులు చెరుపల్లి రఘుపతి, కార్యవర్గం గురువారం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా AD సంఘం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాల నర్సింహ, ఈపూరి వెంకటేశ్వర్లు, జెల్ల రమేష్, మిర్యాల శ్రీనివాసు, రచ్చ వేణుమూర్తి పాల్గొన్నారు.



































