హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలంగాణ మహిళా
కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆల్
ఇండియా మహిళా
కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, తెలంగాణ ఇన్‌చార్జ్ కమలాక్షి, మయూరి సింగ్, ఆదితి పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మహిళా
కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్, అల్కా లాంబాను మర్యాదపూర్వకంగా కలిశారు.