కట్టంగూరు మండలం యరసానిగూడెం గ్రామానికి చెందిన భాగవత కళారంగ ప్రముఖులు వస్తుప్పల అంజయ్య బుధవారం మధ్యాహ్నం మరణించారు. భాగవత కళారంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలు, మధుర స్వరం, అద్భుత నటన, అసామాన్య కళా ప్రతిభ చిరస్మరణీయమైనవి. వారి మరణం కళారంగానికి తీరని లోటుగా గ్రామస్తులు భావిస్తున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామ ప్రజలు ప్రార్థిస్తూ ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.