తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

5చూసినవారు
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం
కట్టంగూరు మండలం యరసానిగూడెం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకిటి శంకర్ ముదిరాజ్, అంగన్వాడీ టీచర్ కాసర్ల నవనీత మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించడం వల్ల సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగిస్తే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి తీగల యాదయ్య, రేఖ, సుజాత, సువర్ణ, రూప తదితరులు పాల్గొన్నారు. త

సంబంధిత పోస్ట్