నకిరేకల్ నియోజకవర్గంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం 138 మంది లబ్ధిదారులకు రూ. 45.25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.