
ప్లాస్టిక్ డ్రమ్‌తో హై-టెక్ కూలర్.. వీడియో వైరల్
మధ్యతరగతి ప్రజల సృజనాత్మకతకు అద్దం పట్టేలా, ఒక వ్యక్తి సాధారణ నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌ను హై-టెక్ కూలర్‌గా మార్చాడు. ఈ కూలర్ ఏసీని తలదన్నేలా చల్లటి గాలిని అందిస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గడ్డి, నీటి సరఫరాతో పాటు మోటార్, ఫ్యాన్ అమర్చిన ఈ కూలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, నిపుణులు ఇలాంటి ప్రయోగాలలో ఎలక్ట్రికల్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.




