రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్లగొండ జిల్లాలోని మూసి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు చేరగా, ప్రస్తుతం 644 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 4.46 టీఎంసీలకు గాను, ప్రస్తుత నీటిమట్టం 4.20 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ప్రవాహం 49,791 క్యూసెక్కులుగా ఉండగా, దానికి అనుగుణంగా నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.