మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు హాట్ కామెంట్స్.

3చూసినవారు
మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు హాట్ కామెంట్స్.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రజాపాలన. ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి బజారు రౌడీల మాట్లాడారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆరోపించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గురువారం కౌన్సిలర్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాస్కరరావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తామంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, ఎవరికీ భయపడేది లేదని, మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసిందే తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్