విద్యార్థుల అభ్యున్నతికి గజ ఇంజినీరింగ్ సేవలు

0చూసినవారు
విద్యార్థుల అభ్యున్నతికి గజ ఇంజినీరింగ్ సేవలు
కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. సోమవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, భాషా నైపుణ్యాల అభివృద్ధి, ఏఐ ఆధారిత విద్య కోసం కంప్యూటర్‌ను బహుకరించారు. హై స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్, ప్రింటర్ అందజేశారు. కంపెనీ చీఫ్ మేనేజర్ ఊట్కూరి జనార్థన్ విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్