యరసానిగూడెంలో గాంధీ జయంతి.. గ్రామసభలో అభివృద్ధి, బాల్య వివాహాలపై చర్చ

0చూసినవారు
యరసానిగూడెంలో గాంధీ జయంతి.. గ్రామసభలో అభివృద్ధి, బాల్య వివాహాలపై చర్చ
నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని కట్టంగూరు మండలం యరసానిగూడెం గ్రామపంచాయతీలో శుక్రవారం  సర్పంచ్ ఆకిటి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, VBG పథకంలో భాగంగా రెండో గ్రామసభను నిర్వహించి, గ్రామాభివృద్ధి పనులు మరియు బాల్య వివాహాల నివారణపై చర్చించి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పులకరం పూజిత, పంచాయతీ కార్యదర్శి తీగల యాదయ్య, పాలకవర్గ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ అంజమ్మ, అంగన్‌వాడీ టీచర్ కాసర్ల నవనీత, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్