పంట మార్పిడితో అధిగ దిగుబడులు

37చూసినవారు
పంట మార్పిడితో అధిగ దిగుబడులు
నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ శుక్రవారం కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో జాతీయ నూనె గింజల పథకం 2025-26 ద్వారా యాసంగిలో విత్తనాలు పంపిణీ చేసిన రైతుల పంట పోలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పంట మార్పిడి చేసుకోవడం ద్వారా భూమిలో సారం పెరిగి అధిగ దిగుబడులు వస్తాయని తెలిపారు. ముఖ్యంగా వేరుశనగ సాగులో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పత్తి పంట తర్వాత యాసంగిలో పెసర, మినుము, వేరుశనగ పంటలను సాగు చేయడంతో భూమిలో పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్