నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని వీటి కాలనీలో శ్రీ శివపుత్ర యువసేన ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడు అబ్బ గోని రమేష్ నేతృత్వంలో ఘనంగా మహా చండీయాగం నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న వారికి అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు లభిస్తాయని, అమ్మవారి కృపకు పాత్రులవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.