వాడవాడలో మేడే ఉత్సవాలను నిర్వహించాలి

3చూసినవారు
వాడవాడలో మేడే ఉత్సవాలను నిర్వహించాలి
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను వాడవాడలా ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి జీవిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక కా, మేకల లింగయ్య స్మారక భవనంలో జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరశిస్తూ గ్రామ గ్రామాల్లో ప్రదర్శనలు, సభలు, జంఢావిష్కరణ లు చేపట్టనున్నారని అన్నారు. పోరాడి సాధించిన కార్మిక, కర్షక చట్టాలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్