ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమావేశం

0చూసినవారు
ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమావేశం
నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో బుధవారం, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చిట్యాల మండలానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆటంకాలు లేకుండా చూడాలని, హమాలీలు, లారీలు తగినన్ని అందుబాటులో ఉంచి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లతో మాట్లాడి ధాన్యం లిఫ్టింగ్ వేగవంతం చేయాలని, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్