నకిరేకల్ లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ దుస్తుల అందజేత

7చూసినవారు
నకిరేకల్ లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ దుస్తుల అందజేత
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం నుంచి నకిరేకల్ లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు సేకరించిన వేలాది కొత్త షర్ట్స్, పాయింట్స్ ను శుక్రవారం సూర్యాపేట చేయూత దుస్తుల బ్యాంక్ కి అందించారు. చేయూత ప్రతినిధి ప్రభాకర్ ఈ దుస్తులను మద్దిరాల మండలంలోని నిరుపేదలకు, అనాధ పిల్లలకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ కు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త దుస్తులు అందుకున్న విద్యార్థుల ముఖాల్లోని చిరునవ్వు ఎంతో సంతృప్తినిచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మదేవర నరేష్, రాచకొండ ప్రభాకర్, వెంకన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్