
బెంగళూరులో ప్రేమజంట ఆత్మహత్య
బెంగళూరులో సహజీవనం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుంట బాబురెడ్డి (31) ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం, అతనితో సహజీవనం చేస్తున్న 31 ఏళ్ల యువతి అదే భవనంలోని 17వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతానికి చెందిన బాబురెడ్డి ఈ దారుణానికి పాల్పడగా, యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




