గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి, ఆరెగూడెం గ్రామాల సరిహద్దుల్లో ఉన్న పిల్లాయిపల్లి కాల్వకట్ట తెగిపోయింది. దీనితో కాల్వలోని నీరంతా లోతట్టు ప్రాంతాల్లోని వరిచేట్లలోకి ప్రవహించి, పంటలను ముంచెత్తింది. కట్ట నాణ్యత కోల్పోవడంతో ఈ తెగింపు సంభవించిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుస్తోంది.