పల్స్ పోలియో ప్రారంభం.. చుక్కలు వేసిన సర్పంచ్

432చూసినవారు
పల్స్ పోలియో ప్రారంభం.. చుక్కలు వేసిన సర్పంచ్
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్ భగత్ గౌడ్ చిన్నార్లకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్