తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.