కేతేపల్లి మండలం చేరకుపల్లి గ్రామానికి చెందిన పోకల నవనీత, రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని పవన్ సాయి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో, పవన్ సాయి హాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ గౌడ్, మృతురాలి భర్త పోకల మోహన్ రావును, వారి ముగ్గురు పిల్లలను పరామర్శించి, ధైర్యం చెప్పి, రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ శ్రీనివాస్ గౌడ్‌ను కుటుంబ సభ్యులు అభినందించారు.