ఎల్లారెడ్డిగూడెం బస్‌స్టాప్ ఏర్పాటుపై ఆర్టీసీ ఆర్‌ఎం హామీ

739చూసినవారు
ఎల్లారెడ్డిగూడెం బస్‌స్టాప్ ఏర్పాటుపై ఆర్టీసీ ఆర్‌ఎం హామీ
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో అధికారిక బస్‌స్టాప్ ఏర్పాటు చేయాలని బీఎస్పీ నాయకులు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో సరైన బస్‌స్టాప్ లేకపోవడంతో ప్రతిరోజూ ప్రయాణించే శ్రామికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా అంబేద్కర్ స్టాచ్యూ ఎదుట బస్సులు ఆగకపోవడంతో 100–200 మంది ప్రయాణికులు సమస్యలు పడుతున్నారని వారు వివరించారు. దీనిపై ఆర్టీసీ ఆర్‌ఎం సానుకూలంగా స్పందించి ఎల్లారెడ్డిగూడెంలో బస్‌స్టాప్ ఏర్పాటు చేసి అన్ని డిపోల బస్సులు అక్కడ ఆగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్