నార్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

1చూసినవారు
నార్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరుణాచలం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులతో వెళ్తున్న బస్సును డీసీఎం వాహనం ఢీకొనడంతో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్