ఇటీవలి వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రామన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సీపీఎం నాయకులతో కలిసి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడమే ధాన్యం తడవడానికి కారణమని ఆయన అన్నారు.