నకిరేకల్‌లో SIR అవగాహన సదస్సు..

2362చూసినవారు
నకిరేకల్‌లో SIR అవగాహన సదస్సు..
నకిరేకల్ గీత మందిరంలో కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూర్ మండలాల BLOలు, బూత్ లెవల్ ఏజెంట్లకు SIRపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం పాల్గొని, ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఓటరు నమోదు, మార్పులు, తొలగింపుల్లో పొరపాట్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్