నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామ పంచాయతీ వద్ద సోమవారం ఉదయం 9 గంటలకు గ్రామసభ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో SIR ప్రక్రియలో తప్పులు వచ్చినవారు, BLO నోటీసులు అందుకున్నవారు తమ స్థానిక ఆధార్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు సర్టిఫికెట్లతో హాజరుకావాలని గ్రామ సర్పంచ్ చిరుమర్తి ధర్మయ్య తెలిపారు.