
మగాడిపై లైంగిక దాడి.. ఆపై కత్తితో పొడిచి హత్య
TG: లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన HYD నాచారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. 45 ఏళ్ల పెయింటర్ ఎల్బీనగర్ వద్ద ఆదివారం రాత్రి ఎవరైనా లిఫ్ట్ ఇస్తారని వేచి చూస్తున్నాడు. అటుగా కారులో వచ్చిన నలుగురు యువకులు అతడిని కారులో ఎక్కించుకుని లైంగికంగా వేధించారు. బాధితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వారు అతన్ని నాచారం పారిశ్రామికవాడకు తీసుకెళ్లి కత్తితో 8 పోట్లు పొడిచి చంపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాధితుడు ఈ విషయాన్ని చెప్పి మరణించాడు.




