గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు అండ అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు మంగళవారం ఈనెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కట్టంగూరు మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో దిశ నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.