నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాలకేంద్రం వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరింది. దీనితో శనివారం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బ్రిడ్జి కింద నుంచి వర్షపు నీరు వెళ్లే మార్గం మూసుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోయింది. పోలీసులు సెప్టిక్‌ట్యాంక్ వాహనం, అగ్నిమాపక యంత్రాల సహాయంతో నీటిని తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు.