విద్యుత్ షాక్‌తో రెండు బర్రెలు, దూడ మృతి

0చూసినవారు
విద్యుత్ షాక్‌తో రెండు బర్రెలు, దూడ మృతి
కట్టంగూర్‌ మండలంలోని తేలువారిగూడెం గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైతు తేలు రవి జీవనాధారమైన రెండు బర్రెలు, ఒక దూడ విద్యుత్ తీగల కారణంగా మృతి చెందాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, గాలివానకు గ్రామ శివారులోని విద్యుత్ స్తంభం విరిగిపడటంతో తీగలు నేలపై పడ్డాయి. విద్యుత్ ప్రవాహానికి గురైన పశువులు అక్కడికక్కడే మరణించాయి. దీంతో రైతు కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్