ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ

3చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనాధికారికంగా విధులకు గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్