కట్టంగూర్ మండలం యరసానిగూడెం గ్రామ ప్రవేశ ద్వారం వద్ద గ్రామ సర్పంచ్ అకిటి శంకర్ ముదిరాజ్, ఉప సర్పంచ్ పులకరం పూజిత మరియు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నూతన ఊరి సూచిక బోర్డును ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ బోర్డు గ్రామానికి వచ్చే ప్రజలు, ప్రయాణికులు గ్రామాన్ని సులభంగా గుర్తించేలా సహాయపడుతుంది. గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు. గ్రామ అభివృద్ధికి పాలకవర్గం మరింత కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.