నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, చదువుకున్న యువత బీఆర్ఎస్ పార్టీ వైపు రావడం పార్టీ విధానాలకు లభిస్తున్న ప్రజా మద్దతుకు స్పష్టమైన నిదర్శనమని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవలే బీటెక్ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మారగోని రమేష్ కుమార్తె మారగోని తేజస్విని, చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.