
సర్పంచులు గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలి
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్ లో గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ, రానున్న 5 సంవత్సరాల కాలంలో సర్పంచులు గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.



































