పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా 12వ బెటాలియన్ పోలీసులు కమాండెంట్ కె. వీరయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 12వ బెటాలియన్ నుంచి చెరువుగట్టు మీదుగా చర్లపల్లి వరకు జరిగింది. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ, ప్రజలు హెల్మెట్ ధరించడం ప్రాముఖ్యతను గుర్తు చేశారు. ట్రాఫిక్ పోలీసులు, ఇతర సంస్థలు హెల్మెట్ ధరించమని ప్రోత్సహించినప్పటికీ, కొందరు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న, ఆర్ఎలు, ఆర్ఎస్ఐలు సహా 150 మంది సిబ్బంది పాల్గొన్నారు.