కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘ, కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వివిధ రంగాల కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.