నల్గొండ జిల్లాలో ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయితీ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ నెలాఖరులోగా పన్ను చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా అధికారులు ప్రజలకు సూచించారు. NLG మున్సిపాలిటీకి రూ.8.50 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.5.50 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మిగిలిన రూ.3 కోట్లను నాలుగు రోజుల్లో వసూలు చేసేందుకు కార్పొరేషన్ సిబ్బంది కృషి చేస్తున్నారు.