ప్రతి శాఖకు సంబంధించిన భవనాల తాజా స్థితిగతులపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ జిల్లాలోని వార్డ్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లాలోని 7 మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్లతో ప్రస్తుతం వినియోగంలో ఉన్న పాత ప్రభుత్వ భవనాలు, అలాగే ఇటీవల నిర్మించబడిన లేదా అందుబాటులోకి వచ్చిన కొత్త ప్రభుత్వ భవనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డు పరిధిలో ఏయే శాఖల కార్యాలయాలు పనిచేస్తున్నాయనే అంశాలపై వివరాలను సేకరించారు.