నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. 110వ జయంతి సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆచార్య జయశంకర్, కొండా లక్ష్మణ్ లు తెలంగాణ రాష్ట్ర రూపకర్తలని, కేసిఆర్ వారి సహాయ సహకారాలతో, సూచనలతో వారు చూపిన బాటలోనే ముందుండి ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు.