ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా, సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, కార్మిక చట్టాలు, హక్కుల రక్షణ, పెరుగుతున్న ధరల నియంత్రణ, కేంద్ర ప్రభుత్వం పని గంటల పెంపును నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని ఆయన కోరారు. శుక్రవారం నాడు సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన ఎర్రజెండాను ఎగరవేసి, కార్మికుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.