నల్లగొండ కోర్టు మంగళవారం ఒక హత్య కేసులో నిందితుడు మల్లేశ్వర్రావుకు రెండు యావజ్జీవ కారాగార శిక్షలు, మరో మూడేళ్ల కఠిన శిక్ష, మూడు జరిమానాలు విధిస్తూ తీర్పునిచ్చింది. 2018 డిసెంబర్ 12న నల్లగొండ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ హత్య కేసులో మృతుని సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 302 కింద నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 10,000 జరిమానా విధించినట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు.