ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఐద్వా

2చూసినవారు
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఐద్వా
పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు సరఫరా చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో రేషన్ వ్యవస్థను బలోపేతం చేసి, బియ్యంతో పాటు పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు, కందిపప్పు, సబ్బులు వంటి 14 రకాల నిత్యావసరాలను అందించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్