కార్మికులకు అండ ఏఐటీయూసీ జెండా

1చూసినవారు
కార్మికులకు అండ ఏఐటీయూసీ జెండా
దేశంలో ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని, స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. 1920 అక్టోబర్ 31న ఏర్పాటైన ఏఐటీయూసీ, కార్మికులకు అనేక సంక్షేమ చట్టాలు, హక్కులు సాధించిందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్