బస్సులన్నీ చండూరు వాటర్ ట్యాంక్ సెంటర్‌కు వచ్చేలా చూడాలి

4చూసినవారు
బస్సులన్నీ చండూరు వాటర్ ట్యాంక్ సెంటర్‌కు వచ్చేలా చూడాలి
చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, బుధవారం నల్లగొండ డిపో మేనేజర్ రమణకు ఒక వినతి పత్రం అందజేశారు. చండూరుకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ మున్సిపల్ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్దకు రావాలని ఆయన కోరారు. ప్రస్తుతం చండూరు బస్టాండ్ పట్టణానికి దూరంగా ఉండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, నల్లగొండ నుండి వచ్చే లోకల్ బస్సులు కూడా చండూరు బస్టాండ్ లోనే ప్రయాణికులను దించుతున్నాయని, దీనివల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్