మహిళా అధికారులపై ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాలను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ల బదిలీలను ముఖ్యమంత్రి చూసుకుంటారని, ఐఏఎస్ ఉద్యోగం రావడం అంత ఆషామాషీ కాదని, వారిపై అభాండాలు వేయడం సరికాదని ఆయన అన్నారు. అన్ని మీడియా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పుడు వార్తలు వేయడం సరైంది కాదని, మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.